• 5 years ago
ఇటాలియన్ ప్రీమియం స్కూటర్ బ్రాండ్ వెస్పా భారత మార్కెట్లో "వెస్పా రేసింగ్ సిక్స్టీస్" పేరిట కొత్త లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్లను విడుదల చేసింది. వెస్పా రేసింగ్ సిక్స్టీస్ రెండు ఇంజన్ వేరియంట్లలో లభ్యం కానున్నాయి.

వెస్పా రేసింగ్ సిక్స్టీస్ స్కూటర్లను కంపెనీ విక్రయిస్తున్న వెస్పా SXL 125 మరియు SXL 150 మోడళ్లను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. వెస్పా ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను తొలిసారిగా ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది. ఇప్పుడు ఈ రెండు మోడళ్లను కంపెనీ అధికారికంగా మార్కెట్లో విడుదల చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్సపై ఆసక్తిగల కస్టమర్లు ఏదైనా వెస్పా బ్రాండ్ డీలర్‌షిప్‌ల ద్వారా కానీ, ఆన్‌లైన్ ద్వారా కానీ 1000 రూపాయలకు బుక్ చేసుకోవచ్చు.

Category

🚗
Motor

Recommended