• 5 years ago
జర్మన్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ తమ సరికొత్త 2020 ఎస్ 1000 ఎక్స్‌ఆర్ ప్రో అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్‌ఆర్ ఒకే వేరియంట్ (ప్రో)లో మాత్రమే లభ్యం కానుంది. దేశీయ మార్కెట్లో ఈ మోడల్ ధర రూ. 20.90 లక్షలు.

ఈ కొత్త మోటార్‌సైకిల్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. వినియోగదారులు ఆన్‌లైన్‌లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ డీలర్‌షిప్‌ల ద్వారా ఈ మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్‌ఆర్ డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

Category

🗞
News

Recommended