#Budget 2020 : Great Offer To Young Engineers !

  • 4 years ago
#Budget 2020 : During her Union Budget 2020-21 speech on Saturday, Finance Minister Nirmala Sitharaman announced that that government proposes to start a programme where urban local bodies across the country will give one-year internship to young engineers.
#Budget2020
#UnionBudget2020
#Budget
#UnionBudget2020-21
#EconomicSurvey
#YoungEngineers
#nirmalasitharaman
#indianeconomy
#Parliament
#CEA
#BudgetSessions
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో యువ ఇంజనీర్ల వృత్తిపరమైన అవకాశాల కోసం సరికొత్త ప్రణాళికను ప్రతిపాదించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే ఆయా రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పోరేషన్లలో యువతకు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని అందించేలా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పోరేషన్లలో ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించేలా కార్యక్రమాన్ని రూపొందిస్తామన్నారు. ఇంజనీరింగ్ తర్వాత చాలామంది విద్యార్థులు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని.. అదే సమయంలో మున్సిపల్ కార్పోరేషన్లలో సిబ్బంది కొరత ఉంటోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. కాబట్టి మున్సిపల్ కార్పోరేషన్లలో యువ ఇంజనీర్లకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించడం ఇరువురికి లబ్ది చేకూరుస్తుందన్నారు.
ఇక దేశంలో కొత్త విద్యా విధానాన్ని త్వరలో ప్రకటిస్తామని,విద్యా విధానంపై దాదాపు 2లక్షల సలహాలు,సూచనలు స్వీకరించామని చెప్పారు. 2020-21కి గాను దేశంలో విద్యా రంగానికి రూ.90వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు

Recommended