• 6 years ago
Gandhi is a 1982 epic historical drama film based on the life of Mohandas Karamchand Gandhi, the leader of India's non-violent, non-cooperative independence movement against the United Kingdom's rule of the country during the 20th century.
#GandhiJayanti
#GandhiJayanti2019
#Gandhi150
#RichardAttenborough,
#BenKingsley
#tollywood
#bollywood
#hollywood
#HitSongsOnGandhi
#gandhijayantisongs
#gandhimovie
#MahatmaGandhi
#MohandasKaramchandGandhi


‘గాంధీ గురించి సినిమా తీస్తే ఎవరు చూస్తారు..’ - ఇది ఓ తెలుగు సినిమాలోని పాపులర్‌ డైలాగ్‌. బహుశా అలాంటి అనుమానాలతోనేమో బారతీయ దర్శకులెవరూ మహాత్ముడి జీవిత కథతో సినిమా తీసేందుకు సాహసించలేకపోయారు. మాఫియా డాన్లు, కరుడుగట్టిన నేరస్తుల పాత్రల్లో జీవించి కనక వర్షం కురిపించిన కథానాయకులు..జాతి పిత పాత్రను పోషించే ఆలోచన కూడా చేయలేకపోయారు. బయోపిక్‌ల జోరు కొనసాగుతున్న ఈ తరుణంలో కూడా గాంధీ ప్రస్తావన ఎక్కడా వినిపించడం లేదు. కానీ సుమారు మూడున్నర దశాబ్దాల క్రితమే ఓ పరదేశీ దర్శకుడు... అదీ బ్రిటిష్‌ జాతీయుడు... బాపూజీ జీవితాన్ని కళ్లకద్దుకుని కళాత్మకంగా తెరకెక్కించాడు. ‘నా జీవితమే నా సందేశమ’న్న మహాత్ముడి మార్గాన్ని ప్రపంచానికి చూపించాడు. ఆ మహనీయుడి కథకు ఆస్కార్‌ సైతం సలాం కొట్టి పురస్కార సత్కారం చేసింది. ఆ చిత్రమే ‘గాంధీ’. ఆ దర్శకుడు రిచర్డ్‌ అటెన్‌బరో. ఈ సినిమా చిత్రీకరణలో ఎన్నో అవరోధాలు ఎదురైనా ఓ యజ్ఞంలా భావించి పూర్తి చేశాడాయన..

Recommended