Shoaib Akhtar Responded On Mohammad Amir Retirement From Test Career || Oneindia Telugu

  • 5 years ago
Mohammad Amir Retirement:Speedster Mohammed Amir called time on his Test career, the PakCricket Board (PCB) announced on Friday.
#MohammadAmirretirement
#ShoaibAkhtar
#MohammadAmir
#pakpacer
#PCB

టెస్టు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన పాకిస్తాన్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌పై ఆ దేశ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ నిప్పులు చెరిగాడు. టెస్టు ఫార్మాట్‌ను వదిలి, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే పరిమితం అవుతానంటూ ఆమిర్‌ పేర్కొనడం అక్తర్‌కు తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. అసలు మీలాంటి వాళ్లను ఏ ఫార్మాట్‌లోనూ క్రికెట్‌ ఆడకుండా చేయాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఒకవేళ తానే సెలక్షన్‌ కమిటీలో ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకునే క్రికెటర్లను ఏ ఫార్మాట్‌లో ఎంపిక కాకుండా చేసేవాడినని అక్తర్‌ విమర్శించాడు. 27 ఏళ్లకే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడం అసలు న్యాయంగా అనిపిస్తోందా అంటూ మండిపడ్డాడు.

Recommended