హరీశ్‌ను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుయుక్తులు పన్నుతున్నారు!! -డీకే అరుణ || Oneindia Telugu

  • 5 years ago
CM KCR Target Trouble Shooter Harishrao has been accused of sensationalism. KCR fears that he has a threat from his son-in-law, commented. This is why Harish has been reduced to tours in the constituency. dk aruna, on the other hand, has also been bitter against his rival, ex minister Jupalli Krishnarao.
#DKAruna
#harishrao
#KCR
#ktr
#JupalliKrishnarao
#telangana

సీఎం కేసీఆర్ టార్గెట్ ట్రబుల్ షూటర్ హరీశ్‌రావునని సంచలన ఆరోపణలు చేశారు జేజమ్మ డీకే అరుణ. హరీశ్‌ను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. అందుకోసమే ఇటీవల చింతమడకలో పర్యటించారని తెలిపారు. తన స్వగ్రామంపై కేసీఆర్‌కు ఇప్పుడేందుకు ప్రేమ వచ్చిందని ప్రశ్నించారు. గత ఐదేళ్లు చేయలేనిది .. కొత్త ఇంటికి 10 లక్షల ఫలాలు అందజేస్తామని చెప్పడంలో ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలన్నారు. దీనికంతటికీ కారణం హరీశ్‌రావునని .. ఆయనకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ శతవిధలా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. చింతమడకపై వరాలు కురిపించి హరీశ్ వ్యతిరేక వర్గాన్ని కూడా తనవైపు తిప్పుకునేందుకు కేసీఆర్ ఆడిన డ్రామాగా విమర్శించారు. కేసీఆర్‌కు హరీశ్‌రావు భయం పట్టుకుందని .. ఆత్మరక్షణలోనే సీఎం ఉన్నారని మండిపడ్డారు.
తన ప్రత్యర్థి జూపల్లి కృష్ణారావుపై కూడా ఫైరయ్యారు జేజమ్మ. ఆయన ఏ పార్టీలో ఉన్న వచ్చేది ఏమీ ఉండదన్నారు. ఇటీవల జూపల్లి పార్టీ మారుతారని ప్రచారం జరిగిన నేపథ్యంలో డీకే అరుణ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు తాను పార్టీ మారలేదని జూపల్లి క్లారిటీ ఇచ్చినా డీకే అరుణ కామెంట్స్ చేయడం చర్చకు దారితీసింది. టీఆర్ఎస్ నేతల భూములు ఉన్న చోటే ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రవర్తన నేనే రాజు, నేనే మంత్రిలా ప్రవర్తిస్తున్నారని డీకే అరుణ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇది సరికాదని అభిప్రాయపడ్డారు.

Recommended