IPL 2019 : Rishabh Pant Brought Up His 50 Off 18 Balls

  • 5 years ago
Man of the Match Pant scores 78 off just 27 bolls even as the wickets kept falling around him to take Delhi to a total of 213/6. Seven fours and seven sixes during his innings even taking Jasprit Bumrah to the cleaners in the last overs.
#ipl2019
#delhicapitals
#mumbaiindians
#rishabhpant
#rohithsharma
#shreyasiyer
#ipl
#catch
#shikardhavan
#Prithvi Shaw
ఐపీఎల్ 2019 సీజన్‌లో తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్ యువ హిట్టర్ రిషబ్ పంత్ సిక్సర్లతో చెలరేగిపోయాడు. ముంబై ఇండియన్స్‌తో వాంఖడే వేదికగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో రిషబ్ పంత్ (78 నాటౌట్: 27 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సులు) హాఫ్ సెంచరీ సాధించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.దీంతో ముంబై ఇండియన్స్‌కి ఢిల్లీ క్యాపిటల్స్‌ 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై బౌలర్లలో బుమ్రాతో సహా అందరి బౌలింగ్‌లోనూ పంత్ సిక్సర్ల మోత మోగించాడు. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆదిలోనే పృథ్వీషా(7) వికెట్‌ను కోల్పోయింది. ఆపై కాసేపటికి శ్రేయస్‌ అయ్యర్‌(16) కూడా పెవిలియన్‌ చేరడంతో ఢిల్లీ 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.