• 5 years ago
KL Rahul and Rishabh Pant have been included in the T20I and ODI squads against Australia in a series which will be a run-up to the World Cup 2019.
#indiavsaustralia
#australia
#rishabhpant
#dineshkarthik
#iccworldcup2019
#mskprasad
#teamindia
#mayankmarkande
#netizens

ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌కు భారత్ జట్టును ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. తొలి రెండు వన్డేలకు, చివరి మూడు వన్డేలకు, రెండు టీ20లకు ప్రత్యేకంగా జట్లను ప్రకటించింది. యువ ఆటగాడు రిషబ్ పంత్‌కు వన్డేలు, టీ20ల్లో అవకాశం కల్పించిన సెలెక్టర్లు దినేశ్ కార్తీక్‌కు మాత్రం పొట్టి ఫార్మాట్లోనే అవకాశమిచ్చారు. వన్డేల్లో పంత్ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. అయితే, దినేశ్ కార్తీక్ మాత్రం ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. గత ఏడాదిగా నిలకడగా రాణిస్తున్నాడు.

వరల్డ్ కప్‌కి ముందు జరుగుతున్న చివరి సిరీస్‌ కావడం.. దినేశ్ కార్తీక్‌కు చోటు ఇవ్వకపోవడంతో అతడు వరల్డ్ కప్‌లో ఆడటం అనుమానంగా మారింది. మరోవైపు ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరిస్‌కు దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేయకపోవడంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. స్కూల్ పిల్లల్లాగా ఈ పాలిటిక్స్ ఏంటని నిలదీస్తున్నారు.

Category

🥇
Sports

Recommended