• 5 years ago
The batsman who has been away from the game for nearly three months is currently batting in the nets. He is looking for Syed Mustaq Ali T20 trophy in Mumbai .
#indiavsaustralia
#prithvishaw
#training
#syedmushtaqali
#t20team
#indiacricket
#mayankagarwal
#australia
#opener
#mumbai


ఆస్ట్రేలియాతో టెస్టు సిరిస్‌కు ఎంపిక చేసిన జట్టులో ఓపెనర్‌గా పృథ్వీ షా చోటు దక్కించుకున్నాడు. అయితే, వార్మప్ మ్యాచ్‌లో గాయం కావడం... ఆ తర్వాత గాయం నుంచి కోలుకుంటాడని రెండు టెస్టు మ్యాచ్‌ల వరకు అతడు అక్కడే ఉన్నాడు. గాయం ఎంతకీ తగ్గక పోవడంతో అతడిని రెండు టెస్టు అనంతరం జట్టు మేనేజ్‌మెంట్ స్వదేశానికి తిరిగి పంపించింది.

ఇలా, సుమారు మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న షా ప్రస్తుతం నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ముంబై తరఫున బరిలో దిగేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ సందర్భంగా నెట్ ప్రాక్టీస్‌కు హాజరైన పృథ్వీ షా మాట్లాడుతూ "బౌలింగ్ లైనప్ కలిగిన ఆస్ట్రేలియాతో ఆడేందుకు మంచి అవకాశం వచ్చింది. అయితే దానిని సద్వినియోగం చేసుకోకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందాను" అని అన్నాడు.

"ఆసీస్ పర్యటనకు దూరం కావడం నన్ను ఎంతో బాధించింది. కొన్ని అంశాలు మన చేతుల్లో ఉండవు. మళ్లీ మునుపటి ఫామ్‌ను అందుకోవడానికి ఇప్పుడు ముస్తాక్ అలీ టోర్నమెంట్‌పై దృష్టిసారించాను'' అని పృత్వీ షా పేర్కొన్నాడు. గతేడాది నవంబర్‌లో ఆసీస్ ఎలెవన్ జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో క్యాచ్ అందుకునే క్రమంలో షా గాయపడ్డాడు.

Category

🥇
Sports

Recommended