• 7 years ago
Priyanka Chopra and Nick Jonas’ second wedding reception held in Mumbai. The couple were a sight to watch as they took the centre stage at the reception hosted especially for media, family and friends. Priyanka looked stunning in a blue strapless custom-made Anarkali by Sabyasachi with a huge diamond necklace adorning her neck. Nick complemented her to perfection in a light grey suit.
#PriyankaChopra
#NickJonas
#weddingreception
#receptionphotos
#wedding
#Mumbai
#bollywood


బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన అమెరికన్ ప్రియుడు నిక్ జొనాస్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1, 2 తేదీల్లో క్రిస్టియన్, హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ఇందుకు వేదికైంది. పెళ్లి తర్వాత వెంటనే ఢిల్లీలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయగా... ప్రధాని నరేంద్ర మోడీ సైతం హాజరయ్యారు. బుధవారం (డిసెంబర్ 19)న ఈ దంపతులు ముంబైలోని ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మీడియా వారి కోసం వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో ప్రియాంక చోప్రా సబ్యసాచి డిజైన్ చేసిన బ్లూ స్ట్రాప్‌లెస్ కస్టమ్ మేడ్ అనార్కలి డ్రెస్సులో పెద్ద డైమండ్ నక్లెస్ ధరించి ఎంతో అందంగా దర్శనమిచ్చింది. లైట్ గ్రే సూట్లో నిక్ జొనాస్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా తన భర్తను ప్రియాంక అతిథులకు పరిచయం చేశారు.

Recommended