India vs Australia 2nd Test Day 4: India In Trouble To Chase 287 For Win | Oneindia Telugu

  • 6 years ago
India vs Australia 2nd Test Day 4 : In the second session, Mohammed Shami (6-56) produced a superb spell as he ran through the Australian middle and lower order. Shami claimed his career best figures as Australia lost five wickets for 15 runs.
#IndiavsAustralia
#INDVSAUS
#RishabhPant
#IndiavsAustralia2ndTest
#viratkohli
#MohammedShami

పెర్త్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగోరోజైన సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 132/4తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు 243 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 43 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 287 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేనకు నిర్దేశించింది. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఇప్పటివరకు ఇంతటి పెద్ద లక్ష్యాన్ని చేధించిన దాఖలా లేదు. దీంతో పెర్త్ టెస్టు ఫలితం ఎలా ఉండబోతుందోనని ఆసక్తికరంగా మారింది. మరోవైపు పచ్చికతో కూడిన పిచ్ క్రమంగా బ్యాటింగ్‌‌కి కష్టంగా మారుతండటం విశేషం.