• 7 years ago
Megastar Chiranjeevi title for Vijay Devarakonda movie. Here is the full details.
#VijayDevarakonda
#syeraa
#dearcomrade
#MegastarChiranjeevi
#geethagovindam
#nota
#taxiwala
#tollywood

విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో రోజు రోజుకు సంచలనంగా మారుతున్నాడు. విభిన్నమైన శైలి, యువతని మెప్పించే నటనతో ఆకట్టుకుంటున్నాడు. యువతలో విజయ్ దేవరకొండకు ఇంతలా క్రేజ్ పెరగడానికి కారణం అతడు ఎంచుకుంటున్న కథలు ఒక ఎత్తైతే, ప్రతి చిత్రంలో తన ప్రత్యేకత చాటుకోవడం మరో ఎత్తు. అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్ దృష్టి మొత్తం విజయ్ దేవరకొండపై పడింది. ఆ తరువాత కూడా హిట్స్ పడడంతో క్రేజీ హీరోగా మారిపోయాడు. విజయ్ దేవరకొండ తదుపరి చిత్రాల గురించి జరుగుతున్న ప్రచారం ఆసక్తి రేపుతోంది.
విజయ్ దేవరకొండ నటించిన మూడు చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. వాటిలో గీత గోవిందం, టాక్సీవాలా చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. పొలిటికల్ డ్రామాగా వచ్చిన నోటా నిరాశపరిచింది.

Recommended