కాంగ్రెస్‌కు సవాల్ విసిరిన మోదీ...! | Oneindia Telugu

  • 6 years ago
Returning the Congress' "a chaiwala could become prime minister due to Nehru" barb, Prime Minister Narendra Modi on Friday dared it to make someone "from outside the family" as its chief for him to believe the late leader created a true democratic system.PM Modi also charged the Gandhis with still not being able to come to terms that a "son of a poor mother" could become the country's prime minister.
#PMModi
#bjp
#congress
#rahulgandhi
#chhattisgarhelections

ఛత్తీస్‌గఢ్ రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబికాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై మోడీ విమర్శలు గుప్పించారు. ఒక ఛాయ్‌వాలా దేశానికి ప్రధాని అయ్యాడన్న నిజాన్ని కాంగ్రెస్ వారు ఇంకా జీర్ణించుకోలేకున్నారని ధ్వజమెత్తారు. గాంధీ కుటుంబానికి చెందిన నాలుగు తరాల వారు దేశానికి ఏమి చేశారని ప్రశ్నించారు. ప్రధానిగా తనను ఎన్నుకుంది దేశ ప్రజలని, అదేదో నెహ్రూ వల్లే తను ప్రధాని అయ్యానని కాంగ్రెస్ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నెహ్రూ ప్రవేశ పెట్టిన ప్రజాస్వామ్య విలువల వల్లే ఛాయ్ వాలా కూడా ప్రధాని కాగలిగారని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుంది కాబట్టే ఒక ఛాయ్‌వాలా కూడా ప్రధాని కాగలిగారని వ్యాఖ్యానించారు.

Recommended