• 7 years ago
The Center For Voting Opinions and Trends in Election Research (C-Voter), in its November (week 2) poll has also projected a clear majority of 64 seats to the Congress-TDP combine in Telangana and a very close in Chhattisgarh with a slender edge for the BJP.
#CVoterSurvey
#TelanganaElections2018
#Congress
#TDP
#BJP
#Chhattisgarh
#Telangana

మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తిగా ముగియలేదు. కాంగ్రెస్ పార్టీ తీరుతో సీపీఐ, తెలంగాణ జన సమితిలు ఒకింత అసంతృప్తితో ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ పెద్దలు ఆదివారం రంగంలోకి దిగి ఆ పార్టీల నేతలతో చర్చించారు. ఇప్పుడిప్పుడే సర్దుబాటు కొలిక్కి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీల మధ్య సీట్ల అంశం తేలే పరిస్థితులు వచ్చినప్పటికీ.. ఆయా నియోజకవర్గాల్లో ఆయా పార్టీలకు చెందిన ఆశావహులు మాత్రం నిరనసలు తెలుపుతున్నారు. ఎల్బీనగర్, మహబూబ్ నగర్, పఠాన్‌చెరు, వేములవాడ.. ఇలా పలు టిక్కెట్లు తమకే కేటాయించాలని ఆయా పార్టీలకు చెందిన ఆశావహులు నిరసనలు తెలుపుతున్నారు. ఇది పార్టీలకు మరింత చిక్కులు తెచ్చి పెడుతోంది. తమకు టిక్కెట్ ఇవ్వకుంటే స్వతంత్రంగానైనా బరిలోకి దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఇది అన్ని పార్టీలకు ఇబ్బందిగా మారింది.

Category

🗞
News

Recommended