Telangana Elections 2018 : టార్గెట్ మహాకూటమి...టీఆర్ఎస్ అస్త్రాలు రెడీ | Oneindia Telugu

  • 6 years ago

తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో కూడిన మహాకూటమి లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ అనేక వ్యూహాలను రచిస్తోంది. మహాకూటమి కారణంగా టీఆర్ఎస్‌కు ఇబ్బందులు తప్పవనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... కూటమిని టార్గెట్ చేసేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అస్త్రాలను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. అసెంబ్లీని రద్దు చేసిన పది రోజుల్లోనే పలు సభల్లో ప్రసంగించి ఎన్నికల వేడిని రగిల్చిన కేసీఆర్... మలివిడత ప్రచారాన్ని ఇంకా మొదలుపెట్టలేదు. నవంబర్ మొదటివారంలో కేసీఆర్ ప్రచారాన్ని మొదలుపెడతారని భావించినా... దీపావళి తరువాతే ఆయన పూర్తిస్థాయిలో ప్రచారం మొదలుపెట్టే అవకాశం ఉందని తాజాగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
#TelanganaElections2018
#Chandrababu
#TRS
#uttamkumarreddy
#Kodandaram
#TJSParty
#Mahakutami
#congress
#Telangana