#Metoo : Divya Khosla Responds On Her Husband

  • 6 years ago
బాలీవుడ్ వేదికగా మీటూ ఉద్యమ సెగ కొనసాగుతోంది. పలువురు దర్శకులు, నిర్మాతలు, నటులు మీటూ వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన ఆరోపణలతో వారి చేతుల్లో ఉన్న చిత్రాలు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. కొంతమంది ఇప్పటికే అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. లైంగిక వేధింపులు ఎదుర్కొన కొంతమంది నటీమణులు ధైర్యంగా ఆరోపణలు చేస్తుండడంతో బాలీవుడ్ కుదుపునకు లోనవుతోంది. అదే సమయంలో మీటూ ఉద్యమాన్ని విమర్శించే వారు కూడా పెరుగుతున్నారు. ఊరూ పేరు తెలియని వారు కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా నిందలు వేస్తున్నారనే విమర్స ఎక్కువవుతోంది. తాజాగా టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ పై వివరాలు తెలియని నటి ఆరోపణలు చేసింది.
#metoo
#soumiksen
#sunielshetty
#tanushreedutta
#bollywood
#hornokpleaseme