India Vs England : 2nd Test Day 2 Highlights

  • 6 years ago
England captain Joe Root's decision to bowl first after winning the toss paid off well as their pace battery, led by James Anderson, restricted a stuttering Indian batting line-up to 107 in 35.2 overs on day two of the Lord's Test here on Friday (August 10). India's famed batting line-up once again crumbled like a castle of cards in front of a quality English pace attack from Anderson (5/20), who returned with the honour of completing his sixth five-wicket haul in an innings at Lord's and 26th overall in the longer format of the game.
#IndiaVsEngland
#England
#jamesanderson
#joeroot
#viratkohli
#teamindia

ఆతిథ్య ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత బ్యాటింగ్‌లో అదే తడబాటు.. ఏ ఒక్కరికీ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. తొలి టెస్టులో ఎదురైన ఓటమికి ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌లో బదులిస్తారేమో అని అభిమానులు ఆశించినా టీమిండియా ఆటతీరులో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.
తొలి రోజులాగే రెండో రోజు కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో రెండు సెషన్లలో కేవలం 8.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వర్షం దోబూచులాడిన రెండో రోజు ఆఖరి ఇన్నింగ్స్‌ మాత్రమే పూర్తిగా సాగగా ఇంగ్లండ్‌ పేసర్లు కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులతో చెలరేగారు.
ముఖ్యంగా జేమ్స్‌ ఆండర్సన్‌ (5/20) ధాటికి భారత్‌ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 35.2 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. రవిచంద్రన్ అశ్విన్‌ (29) మాత్రమే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మరో బౌలర్ క్రిస్ వోక్స్‌కు రెండు వికెట్లు దక్కాయి.

Recommended