Hero Prince Stunning Look Surprises His Fans

  • 6 years ago
Bus stop Hero Prince once again coming with Big Bang. His new movie with a love story will go set very soon. After Bigg Boss 1 season, Prince attempting this movie. Sushanth Reddy is director and Producer for the movie.
#Prince
#BiggBoss
#SushanthReddy
#Producer
#director

గతంలో లవర్ బాయ్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రిన్స్ కొత్త అవతారం ఎత్తాడు. ఓ ప్రేమ కథ చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కొత్తదనం నిండి ఉన్న కథతో మరో ప్రేమకథా చిత్రం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇంటెన్సివ్ లవ్ స్టోరీగా చెబుతోన్న ఈ మూవీలో బస్‌స్టాప్ ఫేమ్ ప్రిన్స్ హీరోగా నటిస్తున్నాడు.
తెలుగులో బిగ్‌బాస్1 సీజన్‌లో కంటెంస్టెంట్ గా తిరుగులేని ఆదరణ తెచ్చుకున్నాడు ప్రిన్స్. ఆ రియాలిటీ షోతో ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్‌ను దగ్గరయ్యారు. గత కొన్నాళ్లుగా మంచి కథల కోసం వెయిట్ చేస్తోన్న ప్రిన్స్‌కు ఈ కథ గ్రాండ్ రీ లాంచింగ్‌గా మారబోతుందనే మాట వినిపిస్తున్నది. ఒకరకంగా ఈ మూవీతో ప్రిన్స్ సరికొత్తగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందుకోసం తన లుక్‌ను కంప్లీట్‌గా మార్చుకోవడం గమనార్హం.

Recommended