రేప్ కేసు వాపస్ తీసుకో: భూమి,ఇల్లు ఫాదర్ ఆఫర్!

  • 6 years ago
అత్యాచారం చేసిన బిషప్ మీద నమోదు అయిన కేసు వెనక్కి తీసుకుంటే పోలం, నిర్మించిన ఇల్లు ఇస్తామని, రాజీ కావాలని ఒత్తిడి చేస్తున్నారని కేరళలోని క్రైస్తవ మహిళా సన్యాసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో తమకు ఎలాంటి భూమి, ఇల్లు వద్దని, న్యాయం జరగాలని బాధితురాలి కుటుంబ సభ్యులు అంటున్నారు. రాజీ కావాలని మొబైల్ లో చర్చలు జరిపిన ఓ ఆడియో ఒకటి విడుదల కావడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
జలంధర్ కు చెందిన బిషప్ ఫ్రాంకో ముల్ల్యాకల్ 2014- 2016 మధ్య కాలంలో క్రైస్తవ మహిళా సన్యాసిని (46) మీద 13 సార్లు అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. రెండు సంవత్సరాల మధ్యకాలంలో మహిళా సన్యాసిని బెదిరించి అత్యాచారం చేశాడని కేరళలో కేసు నమోదు అయ్యింది.

#family
#kerala
#nun
#priest
#safety
#bishap