ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • 6 years ago
లోకసభలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పార్లమెంట్‌ సమావేశాలకు తాను హాజరుకాబోనని ఆయన చేసిన ప్రకటన టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.
అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో రాజకీయాలు బాగా లేవన్న జేసీ.. టీడీపీ విప్‌ జారీ చేసినంత మాత్రాన ఏమీకాదని అన్నారు. పార్లమెంట్‌లో మాట్లాడేందుకు సమర్థులైన నాయకులు చాలామందే ఉన్నారని తెలిపారు.
అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఇద్దరికో, ముగ్గురికో మాట్లాడే అవకాశం వస్తుందని, అనుభవం ఉన్నవారు, ఇంగ్లిష్‌పై ప్రావీణ్యం ఉన్నవారు మాట్లాడతారని జేసీ చెప్పారు. తనకు అంతగా, హిందీ, ఇంగ్లీష్ రాదని చెప్పుకొచ్చారు.

Recommended