Rajamouli Plans For RRR Movie Promotion Plan

  • 6 years ago
బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టు తర్వాత దర్శకుడు రాజమౌళి నుండి మళ్లీ అదే స్థాయిలో ప్రేక్షకులు పెద్ద సినిమాను ఆశించడం సహజమే. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఎవరూ ఊహించిన రామ్ చరణ్-ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్ చేయడమే కాదు... తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నడూ చూడని విధంగా 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టుగా తెరకెక్కించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే.
రాజమౌళి ఏదైనా సినిమా తీస్తున్నాడంటే ఆ సినిమా మొదలు పెట్టడానికి ముందే ప్లానింగ్ భారీగా ఉంటుంది. తను తీయబోయే సినిమా బడ్జెట్‌కు తగిన మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంటారు. అలా పర్ఫెక్టుగా ప్లానింగ్ చేశారు కాబట్టే బాహుబలి వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. ‘ఆర్ఆర్ఆర్' విషయంలోనూ రాజమౌళి అలాంటి ప్లానింగే చేస్తున్నారట.
రూ. 300 కోట్ల బడ్జెట్ సినిమా అంటే కేవలం తెలుగు, తమిళంలో అయితే వర్కౌట్ కాదు. ఇండియాలో ఎక్కువ మార్కెట్ హిందీ సినిమాలకే ఉంది. అందుకే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను అక్కడ మార్కెటింగ్ చేసేందుకు కరణ్ జోహార్‌ను రంగంలోకి దింపబోతున్నారట.

Film Nagar source said that, Bollywood film maker Karan Johar came forward to clinch the deal with Rajamouli for his next movie that stars NTR and Ram Charan. The multi-lingual entertainer will commence regular shoot in November this year. The film is being produced by DVV Danayya but it is Rajamouli and his team that is handling entire production and business matters.

Recommended