Renu Desai Explains About Incidents In Her Life

  • 6 years ago
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ విడిపోయిన తర్వాత ఆయన విదేశీ మహిళను మరో పెళ్లి చేసుకోవడం, ఆవిడ ద్వారా పిల్లల్ని కూడా కనడం తెలిసిందే. దాదాపు 8 సంవత్సరాల పాటు తన ఇద్దరు పిల్లల పెంపకంలో మునిగిపోయి పూణెలో ఒంటరిగా జీవితం గడుపుతున్న రేణు దేశాయ్.... పెద్దలు, ఫ్యామిలీ మెంబర్స్ సూచన మేరకు తన జీవితానికి కూడా ఒక మగ తోడు అవసరం అనే నిర్ణయానికి వచ్చి రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. ఆ నిర్ణయంతో రేణు దేశాయ్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలో మరొక వ్యక్తిని పెళ్లాడబోతున్న రేణు దేశాయ్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
కొందరు లేడీస్ కూడా నీకెందుకు మరో పెళ్లి? ఇద్దరు పిల్లలు ఉన్నది సరిపోవడం లేదా అని కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. అది చదివినపుడు చాలా బాధ అనిపించింది పెళ్లి అనేది కేవలం పిల్లల కోసం కాదు కదా? మనకంటూ జీవితంలో ఒక తోడు, మనకంటూ ఒక సపోర్ట్ కోసమే. అది వారు ఎందుకు ఆలోచించలేదో అర్థం కాలేదు. కొందరు లేడీస్ మైండ్ సెట్ కూడా మారాల్సిన అవసరం ఉంది.
నన్ను మాటలు అంటున్న లేడీ ఫ్యాన్స్‌కు ఒకటే చెబుతున్నాను. మీరు కూడా నాలాంటి పరిస్థితిలో, నా స్థానంలో ఉంటే.... 11 సంవత్సరాల పెళ్లి తర్వాత మీకు తెలియకుండా ఒక అమ్మాయితో బిడ్డను కని ఉంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది?