మెహబూబ్ నగర్ లో ఐటి పార్క్ ను ప్రారంబించిన కేటీఆర్

  • 6 years ago
ఉమ్మడి పాలమూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం దివిటిపల్లిలో ఐటీ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. ఈ రోజు పాలమూరు జిల్లా చరిత్రలో లిఖించదగ్గ రోజు అని చెప్పారు.
పాలమూరులో ఐటీ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ పార్కులో దాదాపు 100 పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంటుందన్నారు. ఐటీ టవర్ నిర్మాణానికి 50 కోట్ల రూపాయాలు మంజూరు చేసి 9 నెలల్లోనే పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఐటీ పార్క్ ఏర్పాటు ద్వారా 15 వేల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని
సీఎం కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లా రుణం తీర్చుకుంటున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో అత్యధికంగా నష్టపోయిన జిల్లా పాలమూరు అని అన్నారు. పాలమూరు జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేయబోతున్నామని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను నింపుతున్నామని చెప్పారు.

After announcement of granting an Information Technology park in Mahbubnagar a year ago, Minister for Information Technology K Taraka Rama Rao is expected to lay foundation stone for it on Saturday at Divitipally village.
#Mahbubnagar

Recommended