టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న అందాల తార సొనాలి బింద్రేకు క్యాన్సర్ వ్యాధి సోకిందనే వార్త భారతీయ సినీ ప్రపంచాన్నే కాకుండా, అన్ని వర్గాలను షాక్ గురిచేసింది. క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రస్తుతం సొనాలి బింద్రే అమెరికాలో చికిత్స పొందుతున్నారు. క్యాన్సర్ నుంచి త్వరగా కోలుకోవాలని సన్నిహితులు, అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
సొనాలి బింద్రేకు సోకిన వ్యాధిని మెటాస్టాటిస్ క్యాన్సర్‌గా గుర్తించారు. ఎక్కడైతే లేదా ఏ భాగం వద్ద క్యాన్సర్ కణాలు పుడుతాయో.. అక్కడి నుంచి ఇతర భాగాలకు అవి విస్తరిస్తాయి. తెల్ల రక్త కణాల్లో, రక్తంలో కలిసిపోయి రోగ నిరోధకశక్తిని నాశనం చేస్తాయి.
సోనాలికి క్యాన్సర్ 4వ స్టేజ్‌లో ఉంది. ఈ దశ క్యాన్సర్ ఉన్నప్పుడు మెటాస్టాటిస్ ఏర్పడుతుంది. ఈ స్థాయి చాలా తీవ్రమైనది. ఈ దశలోనే క్యాన్సర్ వేగంగా విస్తరిస్తుంది. కాలేయం, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, ఎముకల్లో మెటాస్టాటిస్ ఏర్పడుతుంది అని వైద్యులు వెల్లడించారు.
క్లిష్టమైన క్యాన్సర్ వ్యాధికి గురైనప్పుడు ఫ్యామిలీ థెరపీ చాలా అవసరం. వ్యాధిగ్రస్తులకు కుటుంబ సభ్యులు అండగా నిలిచి మనోధైర్యం నింపడం అనేది వేగంగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. ట్రీట్మెంట్ సమయంలో వ్యాధి ఎలా మెరుగుపడుతుందనే విషయాన్ని వారికి చెప్పడం చాలా అవసరం అని వైద్యులు వెల్లడించారు.

Category
🎥
Short film