చంద్రబాబూ! మీఅద్భుతాలు చాలు: పవన్‌

  • 6 years ago
సీనియర్ రాజకీయ నాయకుడు దాడి వీరభద్ర రావును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జనసేనాని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా దాడిని పార్టీలోకి రావాలని కోరారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం ప్రశంసల వర్షం కురిపించుకున్నారు.
ఈ రోజు (మంగళవారం-03 జూలై) దాడి పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో పవన్ ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు. మంచి వ్యక్తి, అనుభవశీలి అయిన దాడిని జనసేనలో చేరాలని ఆహ్వానించినట్లు తెలిపారు. ఆ తర్వాత దాడి మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్ గొప్ప నటుడని, ఆయన కుటుంబంతో మూడు దశాబ్దాలుగా అనుబంధముందన్నారు.
పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చారని దాడి ప్రశంసించారు. పవన్ పార్టీలోకి ఆహ్వానించడంపై దాడి స్పందిస్తూ.. అభిమానులు, కార్యకర్తల అభిప్రాయం తీసుకొని నిర్ణయం చెబుతానని చెప్పారు. పవన్ లాంటి వ్యక్తి పార్టీలోకి ఆహ్వానిస్తే చాలామంది నేతలు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన సెలెక్టివ్‌గా పార్టీలో చేర్చుకుంటున్నారు. అలాంటి జనసేనానికి దాడి.. కార్యకర్తల అభిప్రాయం తీసుకొని చెబుతానని అనడం ద్వారా ఓ విధంగా షాకిచ్చారని చెప్పవచ్చునని అంటున్నారు.

Jana Sena chief Pawan Kalyan welcomed uttarandhra senior leader Dadi Veerabhadra Rao into party on Tuesday.
#pawankalyan
#chandrababunaidu
#janasena
#andhrapradesh
#janasenaporatayatra
#visakhapatnam
#dadiveerabhadrarao

Category

🗞
News

Recommended