Ram Charan Talks About Bollywood Entry

  • 6 years ago
Actor Ram Charan, who is riding on the success of Rangasthalam, says that he is open to working in Bollywood again. He also adds that the failure of Zanjeer did hurt him but that won’t stop him from taking up good Hindi films.

రంగస్థలం చిత్ర విజయంతో మెగా పవర్ స్టార్ రాంచరణ్ మంచి జోష్ మీద ఉన్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ చిత్రాల్లో నటించే విషయంపై క్లారిటీతోపాటు పలు అంశాలను ఆయన వెల్లడించారు.
జంజీర్ సినిమా రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ప్రవేశించాను. ఆ చిత్రం నాకు తీవ్ర నిరాశను మిగిల్చింది. హిందీలో జంజీర్ నా ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలు పెట్టుకొన్నారు. దాంతో ప్రేక్షకుల కొంత నిరాశకు గురయ్యారు అని రాంచరణ్ పేర్కొన్నారు.
జంజీర్ ఫ్లాప్ అయినంత మాత్రన నా బాలీవుడ్‌ దారులు మూసుకుపోలేదు. మంచి కథ దొరికితే మళ్లీ హిందీ చిత్రాల్లో నటిస్తాను. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం అని రాంచరణ్ అన్నారు.
జంజీర్‌లో తన పక్కన హీరోయిన్‌గా నటించిన ప్రియాంక చోప్రాపై రాంచరణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రియాంక చోప్రా అద్బుతమైన నటి. అకింతభావంతో పనిచేసే పక్కా ప్రొఫెషనల్. ఆమెతో పనిచేయడం గొప్ప అనుభూతి. మళ్లీ అవకాశం లభిస్తే ఆమెతో పనిచేయడానికి ప్రయత్నిస్తాను అని రాంచరణ్ తెలిపారు.

Recommended