• 7 years ago
Director Indraganti Mohan Krishna's latest movie is Sammohanam. Sudheer Babu and Aditi Rao Hydari are lead pair. Sivalenka Krishna Prasad is the producer. This movie is going to release on june 15th.
#Sammohanam

దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ చిత్రాల్లో ఎమోషనల్ కంటెంట్‌తో కుటుంబ సమేతంగా వినోదించే విధంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అష్టాచెమ్మా, అంతకు ముందు ఆ తర్వాత లాంటి చిత్రాలు అందుకు సాక్ష్యంగా నిలిచాయి. తాజాగా సమ్మోహనం అనే ఆహ్లదకరమైన టైటిల్‌తో జూన్ 15న ఇంద్రగంటి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సన్నితమైన హాస్యం చుట్టూ అల్లుకొన్న ప్రేమకథలో బాలీవుడ్‌లో టాలెంటెడ్ హీరోయిన్ అదితిరావు హైదరీ, టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు భాగస్వామ్యమయ్యారు. సినిమా రిలీజ్‌కు ముందు వచ్చిన టీజర్లు, ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. సినీ నేపథ్యంగా వచ్చిన ఈ క్యూట్ లవ్‌స్టోరి అంచనాలను ఏ మేరకు అధిగమించిందో తెలుసుకోవాలంటే సమ్మోహనం కథలోకి వెళ్లాల్సిందే.
సినిమాను అమితంగా ప్రేమించి సర్వేష్ (నరేష్) కుమారుడు విజయ్ (సుధీర్ బాబు)‌ ఓ చిల్డ్రన్ కామిక్స్ వేసే ఆరిస్టు. సినిమా అన్నా, సినిమా నటులన్నా మంచి అభిప్రాయం ఉండదు. తండ్రి, కొడుకుల మధ్య ఇలాంటి అభిప్రాయ బేధాలు ఎప్పడూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ హీరోయిన్ సమీరా రాథోడ్ (అదితిరావు హైదరీ) నటించే సినిమా షూటింగ్ విజయ్ ఇంట్లోనే జరుగుతుంది. ఆ క్రమంలో సమీరాతో పరిచయం ఇష్టంగా మారుతుంది. వారి మధ్య ఇష్టం మరో మెట్టు ఎక్కి ప్రేమగా మారుతుంది. తన ఇంట్లో షూటింగ్ ముగిసిన తర్వాత విజయ్ వ్యక్తం చేసిన ప్రేమను సమీరా నిరాకరిస్తుంది.
విజయ్ ప్రేమను సమీరా ఎందుకు నిరాకరించింది? తాను ఎక్కువగా ఇష్టపడిన వ్యక్తి ప్రేమను పొందలేకపోవడానికి సమీరాకు ఎలాంటి పరిస్థితులు అడ్డంకిగా నిలిచాయి. సమీరా జీవితంలో చోటుచేసుకొన్న ఓ క్లిష్టమైన పరిస్థితిని విజయ్ ఎలా పరిష్కరించారు. చివరకి తమ ప్రేమను సమీరా, విజయ్‌ ఎలా గెలిపించుకొన్నారు? విజయ్ తండ్రికి ఉండే సినిమా పిచ్చి సినిమాకు ఎలాంటి సపోర్టును అందించింది అనే ప్రశ్నలకు తెర మీద లభించే సమాధానమే సమ్మోహనం చిత్ర కథ.

Recommended