చంద్రబాబు ను దుమ్ముదులిపేసిన పోసాని

  • 6 years ago
Tollywood actor and writer Polsani Krishna Murali on Monday accused that Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu is political broker.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏమిటో చెప్పడానికి ఇవి చాలదా.. అంటూ ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి సోమవారం నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా, ఆస్తులు, ఎన్టీఆర్ నుంచి కుర్చీ లాక్కోవడం, బీజేపీ, వామపక్షాలు, పవన్ కళ్యాణ్‌ను ఉపయోగించుకొని, వదిలేయడం.. ఇలా ఎన్నో అంశాలతో టీడీపీ అధినేతపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా వద్దని గతంలో చంద్రబాబు ఎందుకు అన్నారని, ఇప్పుడు ఎందుకు కావాలంటున్నారో చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం కట్టాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకున్నదని ప్రశ్నించారు. ఇలా చంద్రబాబు ఏమిటో చెప్పడానికి ఎన్నో ఉన్నాయన్నారు.
రాజకీయాల్లో చంద్రబాబు బ్రోకర్ పనులు చేస్తున్నారని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మేకవన్నె పులి అన్నారు. జగన్ చాలా స్పష్టంగా మాట్లాడుతారని చెప్పారు. టీడీపీని స్థాపించిన కొత్తలో..తాను ఎన్టీఆర్‌ను అయినా ఓడిస్తానని చంద్రబాబు చెప్పారని, ఆ తర్వాత ఓడిపోగానే టీడీపీ పంచన చేరారని మండిపడ్డారు. ఆ తర్వాత ఎన్డీఆర్ జెండాను దొంగిలించారన్నారు. చంద్రబాబు అందరినీ మోసం చేశారన్నారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దోరికిపోయాడని పోసాని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మానవత్వం లేకుంటే ఇప్పటికి జైళ్లో ఉండేవాడివని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ఎవరి కాళ్లు పట్టుకున్నావో చెప్పాలని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ కాళ్లు పట్టుకొని చంద్రబాబు విజయవాడకు పారిపోయారన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు యూటర్న్ తీసుకొని ఇప్పుడు మోడీపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాజకీయంగా ఎవరు తనతో వచ్చినా చంద్రబాబు వారిని నాశనం చేస్తారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీలో చంద్రబాబుకు ఏం మార్పు కనిపించిందో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా వద్దని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మోడీని దుర్మార్గుడు అనడం ఏమిటన్నారు.

Recommended