KTR Plays Key Role In Film Industry

  • 6 years ago
Telangana Government balancing the two major communities in the film industry. KTR plays key role in it
# KTR
#TelanganaGovernment

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో నాలుగేళ్లు పూర్తయింది. నేడు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో మంత్రి కేటీఆర్ మంచి సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ కు అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తున్నారు.
చిత్ర పరిశ్రమలో ఎక్కువగా యంగ్ స్టార్స్ ఉంటారు. రాజకీయాల్లో కేటీఆర్ యువనాయకుడే. దీనితో ఆయన స్టార్ హీరోలందరితో సన్నిహితంగా మెలుగుతున్నారు. వాస్తవానికి చిత్ర పరిశ్రమలో కూడా పాలిటిక్స్ లో ఉన్న ఫ్యామిలీలు ఉన్నాయి. కానీ సినిమాకు రాజకీయంతో సంబంధం లేదు అని చెబుతూ కేటీఆర్ అందరిని కలుపుకుని ముందుకు వెళుతున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలకు సింహభాగం సమయాన్ని వెచ్చిస్తూనే సినిమా ఆహ్వానాలని కూడా కేటీఆర్ పరిశీలిస్తున్నారు. 2016 లో పెళ్లి చూపులు చిత్రం చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం సాధించింది. ఆ చిత్రాన్ని కేటీఆర్ ప్రత్యేకంగా వీక్షించి ప్రశంసించారు.
రాంచరణ్ నటించిన ధృవ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఆ వేడుకకు కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆ వేడుకలో కేటీఆర్ అందరిని ఉత్సాహపరిచేలా ప్రసంగించారు.
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విజయం సాధించిన తరువాత చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మహేష్, కొరటాల శివతో కేటీఆర్ ముచ్చటించారు.