Sai Dharam Tej Serious Comments On Pawan Kalyan

  • 6 years ago
Sai Dharam Tej Supports pawan kalyan Political journey
#pawankalyan
#SaiDharamTej

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మెగా ఫ్యామిలీ నుంచి మద్దత్తు పెరుగుతోంది. ఇటీవల రాంచరణ్ మద్దత్తు ప్రకటించగా తాజగా సాయిధరమ్ తేజ్ కూడా అదే బాటలో నడిచాడట. పవన్ కళ్యాణ్ ఒక్కడే జనసేన పార్టీని వన్ మాన్ ఆర్మీగా నడిపిస్తున్నాడు. కుటుంబానికి తన మద్దత్తు ఎప్పుడూ ఉంటుందని, ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని రాంచరణ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తెలిపిన సంగతి తెలిసిందే. రాంచరణ్ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ కూడా రిప్లై ఇచ్చారు. రాజమహేంద్రవరంలో ఓ మాల్ ఓపెనింగ్ కు వెళ్లిన సాయిధరమ్ తేజ్ జనసేన పార్టీకి మద్దత్తు ఉంటుందని తెలిపాడు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించే సమయంలో కుటుంబ మద్దత్తు లేదు. ఆ సమయంలో అనేక రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లే కనిపిస్తున్నారు.
హ్యాపీ మొబైల్స్ కు రాంచరణ్ ఎండార్స్ మెంట్ చేస్తున్నారు. ఆ ప్రకటన సమయంలో మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీకి ప్రచారం చేసే విషయంలో తనకు రెండో ఆలోచన లేదని తెలిపాడు. బాబాయ్ పిలిచిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళతానని రాంచరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా అదే విషయాన్ని ప్రస్తావించాడు. రాజమహేంద్రవరంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లిన తేజు మీడియాతో మాట్లాడాడు. జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తారా అని మీడియా ప్రశ్నించగా తేజు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

Recommended