• 7 years ago
SriReddy sensational comments on Officer movie. SriReddy warns antifan

నటి శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా తన సంచలన వ్యాఖ్యలు కొనసాగిస్తోంది. ఓ వైపు కాస్టింగ్ కౌచ్ పై పోరాటం అంటూనే పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ గా ప్రచారం చేస్తూ ఆయన ఫాన్స్ ని రెచ్చగొడుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆర్జీవీ డైరెక్షన్ లో శ్రీరెడ్డి పబ్లిక్ గా వికృత చేష్టలు చేస్తూ పవన్ కళ్యాణ్ తల్లిని తీవ్రమైన పదజాలంతో దూషించిన సంగతి తెలిసిందే ఆ విషయంలో శ్రీరెడ్డి విమర్శలు ఎదుర్కొంది. తాజగా అర్జీవికి సపోర్ట్ చేస్తూ ఆఫీసర్ చిత్రాన్ని శ్రీరెడ్డి ప్రశంసలతో ముంచెత్తింది.
శ్రీరెడ్డి ఇటీవల ఎక్కువగా అర్జీవిని ప్రశంసిస్తూ పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ గా ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తల్లిని దూషించిన ప్రక్రియలో సూత్రధారిని తానే అని ఆర్జీవీ స్వయంగా అంగీకరించిన సంగతి తెలిసిందే.
ఇటీవల శ్రీరెడ్డి ఆఫీసర్ చిత్రం గురించి కూడా ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి షో నుంచే డివైడ్ టాక్ మూటగట్టుకుంది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి ఆశించిన స్పందన రావడం లేదు.
శ్రీరెడ్డి మాత్రం ఆఫీసర్ గ్రేట్ మూవీ అని ప్రశంసలు కురిపిస్తోంది. నాగార్జున చాలా బాగా నటించారు, రాంగోపాల్ వర్మ గ్రేట్ డైరెక్టర్ అంటూ పొగడ్తల వర్షం కురిపించింది.

Recommended