Graeme Smith Wants No More Of T20 Internationals

  • 6 years ago
At a time when cricketers are switching to limited-overs cricket and signing Kolpak deals at the expense of international cricket, former South Africa skipper Graeme Smith urged the International Cricket Council (ICC) to do away with the shortest format of the game at international level. He also wants ICC to reschedule the T20 tournaments.

దశాబ్దాల చరిత్ర ఉన్న టెస్టు క్రికెట్ మరుగున పడిపోతుందని... టీ20 మాయాలో పడిపోవద్దని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ సూచించాడు. గంటల వ్యవధిలో ముగిసిపోయే ఆ ఫార్మాట్‌కి వస్తున్న ఆదరణ దృష్ట్యా ఎక్కువ పెట్టుబడుల్ని అక్కడే పెడుతున్నారని.. అందులో కొద్దిభాగమైనా టెస్టుల్లోకి మళ్లిస్తే సుదీర్ఘ ఫార్మాట్‌ని రక్షించుకోవచ్చని ఆయన వివరించారు.
అంతర్జాతీయ స్థాయిలో టీ20 మ్యాచ్‌లు జరగడకూడదని బలంగా నమ్మే వ్యక్తిని. కావాలనుకుంటే.. రెండేళ్లకి ఒకసారి టీ20 ప్రపంచకప్‌ని నిర్వహించుకోవచ్చు. టెస్టు క్రికెట్‌ మనుగడ గురించి చర్చించాల్సిన సమయం ఇదే. గతంలో కంటే ఇంకా ఎక్కువగా టెస్టు క్రికెట్‌ మార్కెట్‌ని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం చాలా డబ్బులు టీ20 క్రికెట్‌లోనే పెట్టేస్తున్నారు. ఎందుకంటే టీ20లు అద్భుతమైన ఫార్మాట్. ఐసీసీ ఇప్పటికైనా టెస్టు ఫార్మాట్‌ని రక్షించేందుకు నడుం బిగించాలి. అవసరమైతే టీ20లను తగ్గించి.. టెస్టుల మనగడని కాపాడేందుకు అందరితో చర్చించాలి' అని గ్రేమ్‌స్మిత్ వివరించాడు.

Recommended