చూడకూడదనుకున్నా, వివాదాస్పద చిత్రం గురించి హీరోయిన్ సంగీత!

  • 6 years ago
Sangeetha on her controversial film Uyir. I watched Uyir only once says Sangeetha

నటి సంగీత హోమ్లీగాను, రొమాంటిక్ హీరోయిన్ గా ను మెప్పించింది. 2000 తరువాత ఆమె తెలుగు, తమిళ భాషల్లో అధిక చిత్రాల్లో నటించింది. ఖడ్గం, పెళ్ళాం ఊరెళితే, సంక్రాంతి వంటి తెలుగు చిత్రాలలో సంగీత నటించింది. తమిళ భాషలో కూడా సంగీత నటించింది. సంగీత నటించిన చిత్రాలలో తమిళ చిత్రం ఉయిర్ కాంట్రవర్సీగా మారింది. 2006 లో ఈ చిత్రం విడుదలయింది. తెలుగులో ఈ చిత్రం మనోహరం పేరుతో విడుదలయింది. దాదాపు దశాబ్దం తరువాత ఈ చిత్రం గురించి సంగీత మాట్లాడింది.
ఓ మహిళ తన భర్త తమ్ముడి పట్ల రొమాంటిక్ ఆలోచనలు కలిగిఉండే చిత్రం ఇది. ఆ పాత్రలో సంగీత నటించింది. సంగీత పాత్ర బోల్డ్ గా, నెగిటివ్ షేడ్స్ తో ఉంటుంది. తమిళ నటుడు శ్రీకాంత్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం అప్పట్లో పెను దుమారం రేపింది.
ఆ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సంగీత ఎట్టకేకేట్టకేలకు మనోహరం చిత్ర వివాదంపై మాట్లాడింది. ఆ చిత్రాన్ని తాను చూడకూడని అనుకున్నానని సంగీత తెలిపింది. కానీ మా అమ్మ వత్తిడి వలన థియేటర్ లో చూశానని సంగీత తెలిపింది. ఆ తరువాత మరో మారు ఆ చిత్రం వంక చూడలేదని సంగీత తెలిపింది.
ఆ రోజు ఉదయం దర్శకుడు తనకు మనోహరం కథ చెప్పాడని సంగీత తెలిపింది. ఆ రోజు సాయంత్రమే తమ ఫ్యామిలీ డాక్టర్(ఆమె సైకాలజిస్టు కూడా) తన ఓ కేసు గురించి వివరించారని సంగీత తెలిపింది. విచిత్రం ఏంటంటే దర్శకుడు చెప్పిన కథ, డాక్టర్ చెప్పిన కేసు రెండు ఒకటే అని సంగీత వివరించింది.

Recommended