Kohli Given Challenge To All Celebrities

  • 6 years ago
Challenge Accepted," PM Modi Tells Virat Kohli, With A Promise. Virat Kohli posted a video of himself doing 20 spider planks and tagged PM Narendra Modi for the fitness challenge, which was originally started by Union Minister Rajyavardhan Rathore.Along With Modi so many Celebrities also Particpated in this Physical Challenge.
#viratkohli
#anushkasharma
#fitnesschallenge
#pvsindhu
#sainanehwal

భారతీయులంతా ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో 'హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్' అనే ఛాలెంజ్‌కు రెండు రోజుల క్రితం కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఈ ఛాలెంజ్‌ను సవాల్‌గా తీసుకొని వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన అతడి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ జిమ్‌లో కసరత్తులు చేసిన వీడియోని తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
సైనా నెహ్వాల్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన పీవీ సింధు జిమ్‌లో కసరత్తులు చేస్తోన్న వీడియోని తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. అనంతరం బాలీవుడ్ నటి, దీపికా పదుకొణె, టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని, జ్యోష్న పొన్నప్పలను ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా కోరింది.
పీవీ సింధు ఛాలెంజ్‌ను స్వీకరించిన అఖిల్ అక్కినేని తాను జిమ్ లో వర్కవుట్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ఛాలెంజ్‌ని స్వీకరించాల్సిందిగా మరో నలుగురికి కోరాడు. ఇందులో అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్, వరుణ్‌ ధావన్ ఉన్నారు. వీరిలో నాగచైతన్య ముందుగా స్పందించి తన ఫిట్ నెస్ వీడియో షేర్ చేశాడు.

Recommended