Tollywood Hero To Play Chandrababu Naidu Role In NTR Biopic

  • 6 years ago
Daggubati Rana To Play CBN Role In NTR Biopic. Sources close to Rana almost confirm that the makers approached Rana for CBN’s role as they think he would be apt to reprise onscreen son in law of NTR.
#NTRBiopic
#DaggubatiRana

మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు బయోపిక్ త్వరలో తెరపైకి రాబోతోంది. కొన్ని రోజుల క్రితం నాచారంలోని రామకృష్ణ స్టూడియోలో అఫీషియల్‌గా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం విషయంలో తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దర్శకుడిగా ఈ చిత్ర బాధ్యతలు చేపట్టిన తేజ ఎవరూ ఊహించని విధంగా తప్పుకున్నారు. ఆయన తప్పుకోవడానికి కారణాలు ఏమిటో ఇంకా బయటకు రాలేదు. అయితే ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాలకృష్ణ ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను ముందుకు నడిపించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్రను పోషించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా ఆయనే చేపట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన సినిమాకు సంబంధించిన పాత్రల ఎంపికపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ బయోపిక్‌లో మరో కీలకమైన పాత్ర ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ జీవితంలో అతిముఖ్యమైన వ్యక్తి. ఈ పాత్ర కోసం బాలయ్య పలవురు నటులను పరిశీలించిన అనంతరం చివరకు దగ్గుబాటి రానాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన కాస్టింగ్ పూర్తి కానుంది.మే 28 ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి బాలయ్య నుండి ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. తేజ దర్శకుడిగా తప్పుకున్న నేపథ్యంలో ఆ బాధ్యత ఎవరు భుజానెత్తుకుంటలారనే వివరాలతో పాటు నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు ప్రకటించే అవకాశం ఉందని టాక్.

Recommended