IPL 2018: Punjab Is Losing The Matches Because Of Yuvraj

  • 6 years ago
This was Punjab's first loss from three matches and are on eight points along with Rajasthan, who have played two matches in Group A of the Super League.
#DaleSteyn
#KXIP
#RCB
#IPL2018

వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌‌పై విమర్శలు మొదలైయ్యాయి. తుది జట్టులోకి ఆటగాళ్ల ఎంపిక సరిగా లేదంటూ పలువురు ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జట్టు సహ యజమానురాలైన ప్రీతి జింతా సైతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మెంటార్ సెహ్వాగ్‌పై మండిపడ్డారని సమాచారం. ఆ తర్వాత అవన్నీ పుకార్లని కొట్టిపడేశారు. నిప్పు లేనిదే పొగరాదు అనే వరసలో నిజాలు బయటికి రాలేదు.
ఇప్పుడు మళ్లీ అదే ప్రశ్నను దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్‌ డేల్‌ స్టెయిన్‌ సంధించాడు. ఇందుకుగాను సోషల్ మీడియాని మాద్యమంగా వాడుకున్నాడు. ‘ఎందుకు డేవిడ్‌ మిల్లర్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం ఇవ్వడం లేదు? అంటే నా ఉద్దేశం లెగ్‌ స్పిన్నర్‌ను లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాట్స్‌మెన్‌ చక్కగా ఎదుర్కొంటాడు. మధ్య ఓవర్లలో ఆ బాధ్యతను మిల్లర్‌ నెరవేర్చగలడు. ప్రతి మ్యాచ్‌లో మధ్య ఓవర్లలో ఇప్పుడు అందరూ లెగ్‌ స్పిన్నర్లను ఎదుర్కోవాల్సిందే' అని స్టెయిన్‌ ట్వీట్‌ చేశాడు.
ఐపీఎల్‌ 2018లో 2 మ్యాచ్‌లు ఆడిన మిల్లర్‌ ఒక సారి అజేయంగా నిలిచి 50 సగటుతో 50 పరుగులు చేశాడు. ఫామ్‌లో లేకపోవడంతో యువీని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ బెంచ్‌కే పరిమితం చేసింది. మొత్తం 64 పరుగులు చేసిన యువీ సగటు 12.80. అయితే అతను ఉన్న మ్యాచుల్లో ఒక్క సారి మాత్రమే సరైన అవకాశం వచ్చింది. మిగతా సమయాల్లో ఎదుర్కొన్న బంతులు తక్కువే.
8 మ్యాచ్‌లు ఆడిన ఫించ్‌ 14 సగటుతో చేసింది 84 పరుగులే అయినా అతడికి తగినన్ని అవకాశాలు ఇస్తున్నారు. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌ సైతం 11 మ్యాచుల్లో చేసింది 120 పరుగులే. సగటు 12. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ 7 మ్యాచ్‌లు ఆడి 11.20 సగటుతో 56 పరుగులే చేశాడు.