బాబు పై ఓటుకు నోటు కేసు: 'మోడీ-కేసీఆర్ గేమ్'

  • 6 years ago
YSRCP MLA Roja seeks Telangana govt to punish AP CM Chandrababu Naidu over vote for note issue
#MLARoja
#ChandrababuNaidu
#VoteForCash

మూడేళ్ల తర్వాత ఓటుకు నోటు కేసు అంశం మరోసారి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను వేడెక్కిస్తోంది. నాడు ఓటుకు నోటుకు ప్రతిగా ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చింది. దీంతో అప్పుడు కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు పోరాటంగా కనిపించింది. ఇప్పుడు చంద్రబాబు కేంద్రం నుంచి బయటకు రావడంతో మోడీ సూచన మేరకు కేసీఆర్ ఈ అస్త్రాన్ని బయటకు తీశారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే
ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆడియోలో ఉన్నది చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్ నివేదిక తేల్చిందని, కాబట్టి ముఖ్యమంత్రి పదవి నుంచి చంద్రబాబు గౌరవంగా తప్పుకోవడం మంచిదని కాంగ్రెస్ సీనియర్ నేత సి రామచంద్రయ్య హితవు పలికారు. ఓటుకు నోటు కేసును నీరుగార్చవద్దని బీజేపీ నేత ఆంజనేయ రెడ్డి సూచించారు. ఈ కేసులో చంద్రబాబు స్వర నమూనాకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును తెలుగు ప్రజలకు వెల్లడించాలన్నారు.
కాగా తెలంగాణలో కేసీఆర్ మీటింగ్ పెడితే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకు వణుకు పుడుతోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఓటుకు నోటు కేసు దర్యాప్తు ముమ్మరం అవుతోంది కాబట్టే ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ర్యాలీలు చేస్తున్నారని విమర్శించారు.
ఓటుకు నోట్లు ద్వారా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబును శిక్షించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. 'బ్రీఫ్డ్ మీ' అన్న వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్దారించిందని, కాబట్టి ఆ ఆధారాలతో బాబును అరెస్ట్ చేయాలని అన్నారు.

Recommended