Indian Cricket Board Rules Out Day-Night Test

  • 6 years ago
The Adelaide Test between Australia and India this summer will be played during the day after the tourists failed to agree to play the match under lights.
#IPL2018
#Australia
#India

బీసీసీఐ పట్టుదలకు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) దిగి వచ్చింది. అడిలైడ్‌లో డే/నైట్‌ టెస్టు ఆలోచనను విరమించుకుంది. ఆసీస్‌ టూర్‌లో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్‌లో జరిగే టెస్టును డే మ్యాచ్‌గానే నిర్వహించనున్నట్టు సీఏ ప్రకటించింది. పింక్‌ బాల్‌ టెస్టును నిర్వహించాలని ఆసీస్‌ బోర్డు తీవ్రంగా ప్రయత్నించింది.
అయితే అందుకు భారత జట్టు సిద్ధంగా లేదని, ఆడే ప్రసక్తే లేదని బీసీసీఐ ఖరాఖండిగా చెప్పింది. సంప్రదాయ రెడ్‌ బాల్‌ టెస్టుకు మాత్రమే తాము సిద్ధంగా ఉన్నామని బోర్డు కార్యదర్శి అమితాబ్‌ చౌధురి సీఏకు లేఖ రాశాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం డే/నైట్‌ టెస్టు నిర్వహణకు పర్యాటక జట్టు అంగీకారం తప్పనిసరి.
గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న పర్యాటక జట్లు తప్పనిసరిగా కనీసం ఒక్క డే/నైట్‌ టెస్టు మ్యాచ్ అయినా ఆడుతున్నాయి. దీనికి కొనసాగింపుగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాను కూడా అడిలైడ్ వేదికగా జరిగే టెస్టును డే/నైట్ టెస్టు మ్యాచ్‌ను ఆడాలని క్రికెట్ ఆస్ట్రేలియా కోరింది.
అయితే డే/నైట్‌ టెస్టు ఆడేందుకు కనీసం 12 నుంచి 18 నెలల పాటు ప్రాక్టీస్ అవసరమని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి బీసీసీఐ పరిపాలనా కమిటీ(సీఓఏ)కు చెప్పడంతో ఆస్ట్రేలియాతో డే/నైట్‌ టెస్టు ఆలోచనను బీసీసీఐ విరమించుకుంది.
2015 నుంచి ఆస్ట్రేలియా ఇప్పటివరకు 4 డే/నైట్‌ టెస్ట్‌లు ఆడింది. ఈ 4 టెస్టుల్లో ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు. మొట్టమొదటిసారి 2015లో అడిలైడ్ వేదికగా న్యూజిలాండ్ తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్‌ని నిర్వహించింది.

Recommended