Guntur : Old Man Hurted A Minor Girl With Bad Traits

  • 6 years ago
Ap DGP Malakondaiah said that three police teams searching for Subbaiah. A nine-year-old girl was allegedly by a 50-year-old man Subbaiah at Dachepalli in Guntur district.
#Gunturdistrict
#DGPMalakondaiah
#Minorgirl

నిర్భయ లాంటి కఠినమైన చట్టాలొచ్చినా మహిళలపై మాత్రం అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆసిఫా అత్యాచార ఘటన మరువక ముందే గుంటూరు జిల్లా దాచేపల్లిలో అలాంటిదే మరో దారుణం జరిగిన సంగతి తెలిసిందే. 9 ఏళ్ల బాలికపై అన్నం సుబ్బయ్య(50) అనే వ్యక్తి అత్యాచారానికి తెగబడ్డాడు. బాధిత తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు నిందితుడిని పట్టుకోవాలంటూ స్థానికులతో పాటు వివిధ సంఘాలు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దాచేపల్లిలో పోలీస్‌ బలగాలను భారీగా మోహరించారు.
గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్‌బాలికపై అత్యాచారానికి పాల్పడిన 50 ఏళ్ళ సుబ్బయ్య కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్టు ఏపీ డీజీపీ మాలకొండయ్య చెప్పారు. మానసిక వైకల్యంతోనే సుబ్బయ్య ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని డీజీపీ అభిప్రాయపడ్డారు. దాచేపల్లి ఘటనపై గురువారం సాయంత్ర అమరావతిలో మీడియాతో మాట్లాడారు. దాచేపల్లి ఘటనలో ఇవాళ ఉదయం నుండి చోటు చేసుకొన్న ఘటనలపై పోలీసులు సంయమనంతో వ్యవహరించారని ఆయన చెప్పారు. దాచేపల్లిలోని ఐజీ, ఎస్పీ , పోలీసులు ఉన్నారని ఆయన చెప్పారు.
దాచేపల్లిలో మైనర్‌బాలికపై అత్యాచారానికి పాల్పడిన 50 ఏళ్ళ సుబ్బయ్య గతంలో రెండు వివాహలు చేసుకొన్నారని డీజీపీ చెప్పారు. అయితే ఇద్దరు భార్యలను కూడ సుబ్బయ్య వదిలేశాడని ఆయన చెప్పారు. భార్యలను వదిలేసిన తర్వాత ఒంటరిగానే ఆయన జీవనం సాగిస్తున్నాడని ఆయన చెప్పారు.రిక్షాపుల్లర్‌గా సుబ్బయ్య జీవనం సాగిస్తున్నాడని ఆయన చెప్పారు. సుబ్బయ్యకు తెలిసిన బాలికను మాయామాటలతో అత్యాచారానికి పాల్పడ్డారని డీజీపీ చెప్పారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత నిందితుడు సుబ్బయ్య కృష్ణానది వైపు వెళ్ళినట్టు డీజీపీ చెప్పారు. నిందితుడి కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. నిందితుడు మానసిక వైకల్యంతో ఈ దారుణానికి పాల్పడి ఉంటారని డీజీపీ చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం కూడ చాలా సీరియస్‌గా ఉందని చెప్పారు.
దాచేపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం నేపథ్యంలో గ్రామస్తులు, ప్రజా, మహిళా సంఘాలు ఆందోళనకు దిగడంతో దాచేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ బంద్ కొనసాగుతుండగా మరోవైపు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలతో గ్రామం అట్టుడుకి పోతోంది.

Recommended