Mahesh Babu Along with Galla Jayadev Reaches To vijayawada

  • 6 years ago
Mahesh and Bharat Ane Nenu team went to Vijayawada. Mahesh to watch movie with fans

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నాడు. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. కొరటాల, మహేష్ బాబు సూపర్ హిట్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం మ్యాజిక్ రిపీట్ చేసింది. శ్రీమంతుడు చిత్రం మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. అదేస్థాయిలో భరత్ అనే నేను కూడా విజయాన్ని అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ లో ప్రమోషన్స్ ముగించుకున్న మహేష్ బాబు విజయవాడలో అభిమానులని కలుసుకునేందుకు వెళ్ళాడు. విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తరువాత మహేష్ అభిమానులతో కలసి సినిమా చూడనునట్లు తెలుస్తోంది.
మహెష్ తో పాటు ఆయన బావ, ఎంపీ గల్లా జయదేవ్ కూడా ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు. మహేష్ బాబు పర్యటనని గల్లా జయదేవ్ దగ్గరుండి చూసుకొనునట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు విజయవాడ అన్నపూర్ణ థియేటర్ లో అభిమానులతో కలసి సినిమా చూసిన తరువాత ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు. భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు ప్రెస్ మీట్ సన్నివేశం విజిల్స్ పెట్టిస్తోంది.
#Mahesh Babu
#Bharat ane nenu
#Galla Jayadev

Recommended