Dhoni Creates History by Completing 5000 Score in T20

  • 6 years ago
Dhoni became the first Indian captain to breach the 5000-run mark in Twenty20 cricket. He currently leads the list with 5010 runs ahead of Gautam Gambhir (4242 runs) and Virat Kohli (3591 runs). Dhoni now has a total of 5786 runs in T20 cricket.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో 5000 పరుగులు చేసిన తొలి టీ20 బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోని ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌లో 34 బంతుల్లో 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ధోని... తెలుగు కుర్రాడు అంబటి రాయుడి (82; 53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులు)తో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో 206 పరుగుల విజయ లక్ష్యాన్ని అలవోకగా చేధించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ధోని అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంతకు ముందు ఈ రికార్డు గంభీర్‌ పేరిట ఉంది. ఈ మ్యాచ్‌లో నమోదైన మొత్తం సిక్స్‌ల సంఖ్య 33. ఐపీఎల్‌లో ఇప్పటిదాకా అత్యధికం.
ఒక సీజన్‌లో 200కుపైగా పరుగుల టార్గెట్‌ను రెండు సార్లు చేధించిన రెండో జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది.
#Dhoni
#Gautam Gambhir
#Kohli