Actor Ajay Ghosh speech at Rangasthalam Vijayotsavam. Ram Charan's Rangasthalam movie emerged as blockbuster in tollywood. This movie has collected Rs 100 Cr (share) collection and has crossed 150 Crores (Gross). With showers of praises, Ram Charan and team seems to be buoyed. In this happy time film unit has been organising Success meet in Hyderabad Yousufguda police ground. Power Star Pawan Kalyan attending as Chief guest for the Rangasthalam success meet.
రంగస్థలం చిత్రంలో నటుడు అజయ్ ఘోష్.... విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రెసిడెంట్ చేసే అన్యాయాలకు వంతపాడుతూ, రంగస్థలం గ్రామ ప్రజలను హింసించే పాత్రలో క్రూరమైన పాత్రలో అతడు నటించారు. సినిమాలో చిట్టిబాబు అతన్ని కొడుతుంటే థియేటర్లో చప్పట్లే చప్పట్లు. రంగస్థలం విజయోత్సవంలో ఆయన్ను వేదిక మీదకు పిలిచిన యాంకర్ సుమ ఈ విషయాలను గుర్తు చేశారు.
ఈ సందర్భంగా అజయ్ ఘోష్ మాట్లాడుతూ.... నా మీద ఇంకో మూడు సీన్లు కూడా చిత్రీకరించారు. ఆ మూడు సీన్లు కూడా సినిమాలో ఉంటే బయట కనపడితే జనాలు నన్ను కొట్టేవారు. అంత అద్భుతంగా సుకుమార్ గారు ఆ సీన్లు తీశారు... అని తెలిపారు.
రంగస్థలం విజయం మీ(ప్రేక్షకులు) విజయం, ఎన్ని హైఫై సినిమాలు వచ్చినా గుండెను తడిచేసే సినిమాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుందని నిరూపించింది మీరు అని అజయ్ ఘోష్ వ్యాఖ్యానించారు.
ఇలాంటి కథను ఎంచుకోవడం ద్వారా మన మూలాలను వెత్తుక్కునే విధంగా దర్శకుడు సుకుమార్ చేశారు. ఆయన లెక్కల మాస్టారు, ఆయన ప్రతి లెక్కకు ఒక లెక్కఉంటుంది. ఈ సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వారికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇది మిస్సయితే నా జీవితంలో చాలా మిస్పయ్యేవాడిని. అద్భుతమైన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో ఈ సినిమా చేశాను... అని అజయ్ ఘోష్ తెలిపారు.
ఇవన్నీ ఒక పక్క అయితే ఆడియో ఫంక్షన్లో బ్రహ్మాజీ ఒక మాట అన్నారు. చిరంజీవిగారి కడుపున చరణ్ గారు పుట్టడం చరణ్ గారి అదృష్టం అంటారు. కానీ ఈ సినిమా ద్వారా చిరంజీవిగారు తన కొడుకు గురించి గొప్పగా చెప్పుకునేలా చరణ్ చేశాడు.... అని అజయ్ ఘోష్ తెలిపారు.
ఒక నిర్మాత బ్రతికితే ఇండస్ట్రీలో కొన్ని వేల మందికి అన్నం దొరుకుతుంది. మైత్రి మూవీ మేకర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాను ప్రేమించడం అంటే వారి దగ్గర నేర్చుకోవాలి. కళాకారులను గౌరవించడం అంటే వారి దగ్గర నేర్చుకోవాలి. టెక్నీషియన్స్‌ను గౌరవించడం అంటే వారి దగ్గర నేర్చుకోవాలి. వారు అందరికీ రూపాయి ఒక కళగా ఇచ్చారు, కమ్మటి బువ్వ పెట్టారు. ఎంతో గౌరవించారు, ప్రేమించారు, అందరం కష్టపడ్డాం, అందుకే ఈ రోజు సినిమా ఎక్కడో ఉంది. ఈ విజయంలో మేము కూడా భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది... అని అజయ్ ఘోష్ అన్నారు.

Category
🎥
Short film