IPL 2018: Calf Injury Forces Suresh Raina To Miss Two Games

  • 6 years ago
Chennai Super Kings suffered another blow as vice-captain Suresh Raina was ruled out for 10 days owing to a calf strain. Now, Raina stands to miss Super Kings' next two matches against Rajasthan Royals and Kings XI Punjab. Raina suffered the injury in the match against Kolkata Knight Riders at the M A Chidambaram Stadium on Tuesday (April 10) and the left-hander was struggling to run between the wickets. Raina also sought a quick medical attention during the strategic time out but his condition never really got better.

ఐపీఎల్ 11లో భాగంగా ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించడంతో పాయింట్ల లిస్టులో చెన్నైసూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) తొలిస్థానంలో ఉంది. ఇలాంటి సమయంలో జట్టు కీలక ఆటగాడు సురేన్‌ రైనా గాయంతో తర్వాతి రెండు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. దీంతో వచ్చే ఆదివారం(ఏప్రిల్‌ 15న) కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌, ఏప్రిల్‌ 20న రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లకు రైనా లేకుండానే సీఎస్‌కే బరిలోకి దిగుతుంది.
కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్‌ నరైన్‌ వేసిన 10వ ఓవర్‌లో సింగిల్‌ తీసే సమయంలో రైనా తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. కాలి గాయానికి వారం రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో సీఎస్‌కే ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఎస్‌కే ఆటగాడు కేదార్‌ జాదవ్‌ సీజన్‌ మొత్తానికి దూరమైన సంగతి తెల్సిందే. తాజాగా రైనా కూడా గాయపడటం సీఎస్‌కేకి పెద్ద ఎదురు దెబ్బే.
చేతివేలి గాయంతో బాధపడుతున్న ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఆదివారం మ్యాచ్‌ నాటికి కోలుకునే అవకాశం ఉంది. ప్రాక్టీస్‌ సమయంలో గాయపడిన మురళీ విజయ్‌ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆడేందుకు వీలు కాలేదు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు. రైనా గాయపడటంతో మళ్లీ ఆ స్థానంలో మురళీ విజయ్‌కు ఆడే అవకాశం రావచ్చు.