ప్రత్యేక హోదాపై ఇచ్చిన హమీని నిలుపుకోవాలి : జగన్

Oneindia Telugu

by Oneindia Telugu

137 views
ysrcp chief ys jagan demanded that union government should announce special status to Ap . ys Jagan requested to prime minister modi to announce special status to AP on Twitter.

వైసీపీ ఎంపీలు ఏప్రిల్ 6వ తేది నుండి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ప్రాంగంణంలో ఆమరణ నిరహరదీక్ష చేస్తున్నారు. ఈ దీక్షలో ఉన్న ఎంపీల ఆరోగ్యం క్షీణించింది. ఇప్పటికే ముగ్గురు ఎంపీలను ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజులుగా ఎంపీలు దీక్షలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఎంపీల జీవితాలు, ఏపీ భవిష్యత్ ఆందోళనలో ఉందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదాపై ఇచ్చిన హమీని నిలుపుకోవాలని వైఎస్ జగన్ ప్రధానమంత్రిని కోరారు.
సోమవారం నాడు ట్విట్టర్ వేదికగా జగన్ ప్రధానమంత్రిని ఈ మేరకు కోరారు.ప్రత్యేక హోదా కోరుతూ తమ పార్టీకి చెందిన ఎంపీలు ఆందోళన చేస్తున్న విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన గుర్తు చేశారు. దీక్షలో ఉన్న ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వర ప్రసాద్, వైవీ సుబ్బారెడ్డిల ఆరోగ్యం క్షీణించిందన్నారు. వైద్యుల సూచన మేరకు రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించిన విషయాన్ని ట్విట్టర్‌లో వైఎస్ జగన్ ప్రస్తావించారు.