Modi Get Blamed By YCP MP Varaprasad rao

  • 6 years ago
YSRCP president YS Jaganmohan reddy and his party mp Varaprasad on Monday fired Andhra Pradesh CM Chandrababu Naidu and TDP and BJP for special status issue.

భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.అవిశ్వాసం చర్చకు రాకుండా బీజేపీనే అడ్డుకుంటోందని ఆరోపించారు.పార్లమెంటులో అవిశ్వాసంపై చర్చించాలనే చిత్తశుద్ధి బీజేపీకి లేదని వరప్రసాద్ అన్నారు. ఆయన సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
తిరుపతి దేవుడి సాక్షిగా హోదా ఇస్తామని ప్రకటన చేసిన మోడీ.. ఇప్పుడెందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.అధికారం కోసం అబద్దాలు చెబుతారా? అని ప్రశ్నించారు.రూ.15లక్షలు పేదవాడి ఖాతాలో వేస్తానని చెప్పిన మోడీ..ఇప్పటి వరకు ఆ పని చేయలేదన్నారు. మోడీ కూడా అబద్ధాలపై అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.తాము రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని వరప్రసాద్ అన్నారు.
తాము అవిశ్వాసం పెడితే తమ కలిసి వస్తామని, ఇప్పుడు మరో నాటకం ఆడుతున్నారని అన్నారు. బాబుకు 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, 3సార్లు సీఎం అయ్యారని.. అయితే, మాట మార్చడం, అబద్ధాలు చెప్పడంలో మాత్రం ఆయన తర్వాతే ఎవరైనా అని వరప్రసాద్ విమర్శించారు.
నాలుగేళ్లుగా హోదా అడగని బాబు ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు.హోదా వల్ల వచ్చే లాభాలు బాబుకు తెలియవా? అని చంద్రబాబును వరప్రసాద్ ప్రశ్నించారు. హోదా వల్లే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్యాకేజీ ఇవ్వలేదని బాబు ఇప్పుడు హోదా బాట పట్టారని అన్నారు.
ప్రత్యేక హోదా, ఎంపీల రాజీనామా అంశాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. యువత ఉద్యోగ ఆకాంక్షలకు ప్రతీక ప్రత్యేక హోదా..ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, వైసీపీ శ్రేణులు ఆందోళనలు ఉధృతం చేస్తారని జగన్ తెలిపారు. హోదా కోసం విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్‌ల్లో ఆందోళనలు నిర్వహిస్తారని, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, వైసీపీ శ్రేణులు ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లాస్థాయిల్లో నిరాహార దీక్షలు చేపడతారని ఆయన పేర్కొన్నారు.

Recommended