Deesha Patani Discuss About Her Financial Position At Starting

  • 6 years ago
With no godfather in the industry, battling constant rejections and struggling to make it to the celluloid to bagging the role of the female lead opposite Tiger Shroff in 'Baaghi 2', Disha Patani has come a long way.

సినిమా పరిశ్రమలో స్థిరపడాలంటే గాడ్ ఫాదర్ ఉండాల్సిందే అంటారు. ఒకవేళ ఎలాంటి అండ లేకుండా ఇండస్ట్రీలో నెగ్గుకురావడం చాలా కష్టమంటారు. ఎలాంటి బ్యాకప్ లేకుండా సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్న వారిలో బాలీవుడ్ నటి దిశా పటానీ ఒకరు. ఆమె నటించిన భాగీ2 చిత్రం విడుదలై మంచి టాక్‌ను సంపాదించుకొన్నది. ఈ నేపథ్యంలో దిశాపటానీ మీడియాతో మాట్లాడుతూ..
నాకు ఎలాంటి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. నా సినిమాలు చూస్తారా అనే సందేహం ఉండేది. నాకు ఎవరైనా అవకాశాలు ఇస్తారా అనే అనుమానాలు పీడించేవి. అందుకే పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండేదానిని. యాక్టింగ్ తప్ప నాకు మరో ధ్యాస లేదు. అందుకే మంచి పాత్రల్లో నటించి మెప్పించాలని ఆరాటపడేదానిని అని దిశాపటానీ వెల్లడించారు.
కెరీర్ తొలినాళ్లలో అవకాశాలు చేతికి అందినట్టే అంది చేజారిపోయేవి. అయినా కుంగిపోకుండా అవకాశాల కోసం ఎదురుచూసే దానిని. వచ్చిన అవకాశం కోసం చాలా కష్టపడేదానిని అని దిశా పేర్కొన్నారు.
కాలేజీలో చదువుతుండగానే స్టడీస్‌ను వదిలేసి ముంబైకి వచ్చాను. కేవలం రూ.500తో నేను ముంబైకి వచ్చాను. కొన్నాళ్ల తర్వాత నా వద్ద ఉన్న డబ్బులు ఖర్చయిపోయాయి. దాంతో కష్టాలు ప్రారంభమయ్యాయి.
ప్రతీ రోజు ఏదో ఒక ఆడిషన్‌కు వెళ్లేదానిని. టీవీ యాడ్స్‌లో నటించేదానిని. దాంతో రోజు పూటగడిచేది. ఓ దశలో ఇంటి అద్దె కట్టుకోవడానికి కష్టమయ్యేది. చిన్న చిన్న ఉద్యోగాలు చేశాను. ఏ దశలోనే మనోధైర్యాన్ని కోల్పోలేదు. ఏదో ఒకరోజు మంచి అవకాశాలు వస్తాయని ఎదురుచూసేదానిని.
భాగీ2 చిత్రంలో అవకాశం వచ్చినపుడు చాలా సంతోషపడ్డాను. భాగీ పార్ట్1 చిత్రంలో నేను నటించలేదు కాబట్టి నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. టైగర్ సహకారం అందించడంతో నాకు ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు అని దిశా చెప్పింది.

Recommended