Rangasthalam : Ram Charan Performance Highlight

  • 6 years ago
Allu Sirish and Maruthi response on Rangasthalam movie. Ram Charan performance is highlight of the movie.

టాలీవుడ్ మొత్తం ప్రస్తుతం రంగస్థలం మానియా నెలకొని ఉంది. రంగస్థలం చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. చిట్టిబాబుగా రాంచరణ్ నటనకు అందరూ బ్రహ్మ రథం పడుతున్నారు. వినికిడి లోపం ఉన్న పాత్రలో రాంచరణ్ ఇరగదీశాడని ప్రశంసలు దక్కుతున్నాయి. సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ జాబితాలోకి అల్లు వారబ్బాయి శిరీష్, క్రేజీ దర్శకుడు మారుతి చేరారు.
రాంచరణ్ రంగస్థలం చిత్రంలో కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ కనబరిచాడని అంటున్నారు. స్టార్ హీరో హోదాలో వినికిడి లోపం ఉన్న పాత్రలో నటించడం మామూలు విషయం కాదు. కానీ ఆ ఛాలెంజ్ ని చరణ్ అద్భుతంగా స్వీకరించి నెగ్గాడు.
దర్శకుడు మారుతి రంగస్థలం విజయం పట్ల స్పందించాడు. చిట్టిబాబు పాత్రలో రాంచరణ్ ఇరగదీశాడని ప్రశంసించాడు. సమంత, ఆది పినిశెట్టి నటన అద్భుతంగా ఉందని కొనియాడారు.
రంగస్థలం చిత్రం విజయం సాధించిన సంతోషంలో అల్లువారబ్బాయి శిరీష్ పాటేసుకున్నాడు. రంగా రంగ రంగస్థలాన అంటూ సోషల్ మీడియా వేదికగా తన స్పందన తెలియజేసాడు. అన్ని ఏరియాల నుంచి రంగస్థలం చిత్రానికి అద్భుతమైన రిపోర్ట్స్ వస్తున్నాయని శిరీష్ అభిప్రాయ పడ్డాడు.

Recommended