భవిష్యత్తులో ఆస్ట్రేలియా తరుపున క్రికెట్ ఆడబోనని బాల్ టాంపరింగ్ వివాదంలో ప్రధాన సూత్రధారి అయిన డేవిడ్ వార్నర్ వెల్లడించాడు. శనివారం మీడియా ముందుకు వచ్చిన డేవిడ్ వార్నర్ కళ్లలో పశ్చాత్తాపం.. తప్పు చేశాననే బాధ.. దానిని ఎన్నటికీ దిద్దుకోలేననే మానసిక క్షోభ.. అన్నీ కలసి డేవిడ్ వార్నర్‌ను శాశ్వతంగా క్రికెట్ నుంచి తప్పుకునేలా చేశాయి.
సిడ్నీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ 'క్రికెట్‌ను అమితంగా ప్రేమించే అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నా. క్రికెటర్‌గా నన్ను ఎంతగానో ప్రోత్సహించి నాకు మద్దతుగా నిలిచిన మీ అందరి నమ్మకాన్ని వమ్ము చేశాను. నన్ను క్షమించండి' అని అన్నాడు.
'మీరు తలదించుకునేలా ప్రవర్తించాను. నాకు కాస్త సమయం కావాలి. చేసిన తప్పుని సరిదిద్దుకునేందుకు, మీ నమ్మకాన్ని తిరిగి సంపాదించేందుకు' అంటూ ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ క్రికెట్ ఆస్ట్రేలియాకు తన రాజీనామా లేఖను పంపినట్లు వార్నర్ చెప్పాడు.
మేము దేశం తలదించుకునేలా ప్రవర్తించాం. మేము తప్పుడు నిర్ణయం తీసుకున్నాం. అందులో నా పాత్ర కూడా ఉంది. మళ్లీ ఆస్ట్రేలియా ప్రజల మనసు చూరగొనేందుకు ఎంతో సమయం పడుతుంది. తర్వాత ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ప్రస్తుతానికి నా కుటుంబానికి తోడుగా ఉంటా' అని పేర్కొన్నాడు.
త్వరలో కుటుంబంతో చర్చించిన అనంతరం క్రికెట్ నుంచి శాశ్వతంగా తప్పుకోవాలనే అంశంపై కూడా నిర్ణయం తీసుకుంటానని వార్నర్ ఈ సందర్భంగా వెల్లడించాడు. అంతేకాదు తన ప్రవర్తన సరిగా లేదని దీనిపై నిపుణుల సాయం కూడా తీసుకుంటానని వార్నర్ అన్నాడు.

Category
🥇
Sports