• 6 years ago
Huge US premiers collections for Rangasthalam. Rangasthalam to became one of highest grossers in Telugu cinema.'

మెగా పవర్ స్టార్ రాంచరణ్ రంగస్థలం చిత్రంతో బాక్స్ ఆఫీస్ పై దాడి షురూ చేశాడు. రికార్డుల భరతంపట్టే పనిలోకి నిమగ్నమైపోయాడు. అభిమానుల్లో సినీవర్గాల్లో ఉత్కంఠ రేపిన రంగస్థలం చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్లుగా ఉండడంతో తొలి షో నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులంతా రాంచరణ్ నటన అదుర్స్ అంటూ జై కొట్టేస్తున్నారు. కలెక్షన్స్ పరంగా రంగస్థలం చిత్రం రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే యూఎస్ ప్రీమియర్స్ లో అదిరిపోయే వసూళ్ల గణాంకాలు నమోదయ్యాయి
ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులు చూడని భిన్నమైన కథ, కథనంతో ఈ చిత్రం వచ్చింది. దీనితో అందరిలోనూ ఈ చిత్రం గురించి ఆసక్తి నెలకొని ఉంది.
యూఎస్ ప్రీమియర్స్ తోనే ఈ చిత్రం 620000 డాలర్లు వసూలు చేసినట్లుతెలుస్తోంది. ఈ లెక్కన యుఎస్ డిస్ట్రిబ్యూటర్ కు లాభాల పంట పడుతున్నాడని అంచనా వేస్తున్నారు.
రంగస్థలం చిత్రం కలెక్షన్ల పరంగా టాప్ 10 వరుసలో ఉన్న కొన్ని చిత్రాల స్థానాలని కబ్జా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రంగస్థలం చిత్ర ఓపెనింగ్ వసూళ్లే కళ్ళు చెదిరేవిధంగా ఉండబోతున్నాయి.
యూఎస్ ప్రీమియర్స్ విషయంలో రంగస్థలం చిత్రం బాహుబలి 2, అజ్ఞాతవాసి, బాహుబలి, ఖైదీ నెం 150 మరియు స్పైడర్ చిత్రాల తరువాత ఆరవ స్థానం ఆక్రమించింది.
మెగాస్టార్ చిరంజీవికి ఖైదీ చిత్రంలాగా రాంచరణ్ కు రంగస్థలం చిత్రం అపురూపంగా నిలిచిపోనుంది. చిట్టిబాబు పాత్రలో రాంచరణ్ తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

Recommended