Pawan Speaks About His Relationship With Nithin

  • 6 years ago
Pawan Kalyan Superb Speech about Nithiin at Chal Mohan Ranga Pre Release Event on Sreshth Movies. Pawan Kalyan Creative Works and Sreshth Movies Present ChalMohanRanga 2018 Telugu Movie ft. Nithin& Megha Akash Produced by Pawan Kalyan & Sudhacar Reddy,Story by Trivikram. Music by Thaman S. #ChalMohanRanga Latest 2018 Telugu Movie is directed by Krishna Chaitanya.

నితిన్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా కృష్ణ చైతన్య దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రం 'ఛల్ మోహ‌న్‌ రంగ‌'. శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో ఆదివారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ ముఖ్య అతిథిగాహాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నితిన్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఎలాంటి సపోర్టు లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. అలాగే ఒక సినిమా జయం రావడం, అపజయం రావడం ఇదంతా జరిగినపుడు ఆ భావన, భాధ ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు... అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
నేను వరుస అపజయాల్లో ఉన్నపుడు నితిన్ వాళ్ల నాన్నగారు నా దగ్గరికి వచ్చి మా ‘ఇష్క్' సినిమా ఆడియో రిలీజ్ చేయాలని అడిగినపుడు నాకు ఒకటి అనిపించింది. ఇది మంచి సెంటిమెంట్ అని నా దగ్గరికి వస్తున్నారు, నేను విజయంలో ఉంటే వేరే సంగతి ... కానీ వారు నా మీద అభిమానంతో మనస్ఫూర్తిగా వచ్చారని అర్థమైంది. ఏ విషయంలో అయినా మనం ఒక ఎమోషనల్ సపోర్టు కోరుకుంటాం... నితిన్‌కు నేను వెళితే బావుంటుంది అనిపించి వెళ్లాను. మీ అందరి సపోర్టు వల్ల ఇష్క్ సినిమా విజయం సాధించింది.... అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
కొంద‌రు నా సినిమాలో చూసి ఐఐటీకి వెళ్లిన విద్యార్థులు కూడా ఉన్నారు. జ‌యాల‌కు పొంగ‌కుండా, అప‌జ‌యాల‌కు కుంగ‌కుండా నిల‌క‌డ‌గా ఉంటూ 16 సంవత్సరాల్లో నితిన్ 20 సినిమాలు చేశారు, ఇది గొప్ప విష‌యం. నాకూ, నితిన్‌కీ వ‌య‌సు పెద్ద తేడా ఉన్న‌ప్ప‌టికీ, సినిమాల అనుభవం ప‌రంగా ఐదారేళ్ల తేడానే.... అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
ఈ సినిమా నిర్మాత‌ల్లో నేను ఒక‌డిని అయిన‌ప్ప‌టికీ దీనికి పని చేసిన చాలా మంది నాకు తెలియ‌దు. అందరికీ పేరుపేరునా ధ‌న్య‌వాదాలు. ఈ సినిమా మీ అందరికి ఆనందాన్ని కలిగిస్తుందని మ‌న‌స్ఫూర్తి తెలియజేసుకుంటూ, నితిన్ మరిన్ని విజయాలు పొందాలని, కృష్ణ‌చైత‌న్య‌గారు మరిన్ని హిట్ సినిమాలు చేయాలని, సుధాకర్ రెడ్డిగారు మరిన్ని గొప్ప విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... అని పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ముగించారు

Recommended